మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో, బంగారం ఫ్యూచర్ సోమవారం 1.5 శాతం పెరిగి 10 గ్రాములు రూ.60,274 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర 0.57 శాతం పెరిగి ఔన్స్ 2,000 డాలర్ల మార్క్‌ను దాటి 2,001.6 డాలర్లు(దాదాపు రూ.1,65,419) వద్ద ట్రేడవుతోంది. అయితే న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ COMEXలో వెండి 0.73 శాతం తగ్గి ఔన్స్ 22.54 డాలర్ల(దాదాపు రూ.1,859)కి చేరుకుంది.
* యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం కీలకం : మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్) రాహుల్ కలంత్రి న్యూస్18తో మాట్లాడుతూ.. ‘అమెరికన్ బ్యాంకింగ్ సంక్షోభం తరువాత, బంగారం మార్కెట్ జీవితకాల గరిష్ట స్థాయికి పెరిగింది. SVC బ్యాంక్, ఇతర బ్యాంకులు అకస్మాత్తుగా పతనమైన తర్వాత బులియన్‌ను సురక్షిత మార్గంగా కొనుగోలు చేశారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ అనే రెండు బ్యాంకులు కుప్పకూలాయి. అయితే స్విస్ రుణదాత క్రెడిట్ సూయిస్, US-బేస్డ్ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు గోల్డ్ సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. బంగారం 2000 డాలర్లు (స్పాట్) లెవల్‌ను దాటి కొనసాగితే.. ధరలో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని, బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న అనిశ్చితి కారణంగా గత వారం బులియన్ దాదాపు 4 శాతం లాభపడిందని ఏంజెల్ వన్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీస్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) ప్రథమేష్ మాల్యా అన్నారు. US బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా సురక్షితమైన అసెట్స్‌కు డిమాండ్ పెరగడంతో వరుసగా మూడో వారం బంగారం ధర పెరిగినట్లు తెలిపారు.