1. గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు దూకుడుగా పెరుగుతున్నాయి. రెండు నెలల్లో గోల్డ్ రేట్ రూ.5,000 పైనే పెరిగితే, వెండి ధర కిలోపై రూ.15,000 పెరిగింది. 2022లో గోల్డ్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. కొత్త సంవత్సరంలో కూడా బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
2. మంగళవారం హైదరాబాద్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.51,000 మార్క్‌కు చేరువవుతోంది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.500 పెరగడంతో రూ.50,450 నుంచి రూ.50,950 ధరకు చేరుకుంది. ఇక స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,000 మార్క్ వైపు పరుగులు తీస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.540 పెరగడంతో రూ.55,040 నుంచి రూ.55,580 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో బంగారం ధరతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. మంగళవారం కిలో వెండిపై రూ.1000 పెరిగి రూ.75,000 మార్క్ దాటింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,500. రెండు నెలల్లో కిలో వెండి ధర సుమారు రూ.15,000 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. నవంబర్ 4 నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.50,950 ధరకు చేరుకుంది. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు రూ.4,850 పెరిగింది. ఇక అదే రోజున 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.55,580 ధరకు చేరుకుంది. అప్పటి నుంచి రూ.5,290 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. దేశీయ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.71 శాతం అంటే రూ.394 పెరిగి రూ.55,572 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 1.70 శాతం అంటే రూ.1,186 పెరిగి రూ.70,757 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)