Gold Price today: బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. చెప్పాలంటే అదసలు తగ్గుదల కిందకే రాదు. చాలా తక్కువ. మరోలా చెప్పాలంటే... త్వరలోనే బంగారం ధరలు పెరగడం ఖాయం. కారణం కరోనా. ఇండియాలో మొదటి వేవ్, సెకండ్ వేవ్ వచ్చిన... రెండు సందర్భాల్లోనూ బంగారం ధరలు దూసుకెళ్లాయి. ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి... ప్రజలు... తమ పెట్టుబడులను సేఫ్ జోన్‌గా బంగారంలో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా కరోనా టెన్షన్ బాగా ఉంది. అందువల్లే నగల కొనుగోళ్లు మళ్లీ తగ్గిపోతున్నాయి. ఫలితంగా బంగారం ధరలు కాస్త తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరల్లో పెరుగుదల ఉంది. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.41,100 ఉండగా... 127 రోజుల్లో రూ.3,500 పెరిగింది. అలాగే... 24 క్యారెట్ల ప్యూర్ పెట్టుబడుల గోల్డ్ 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... 127 రోజుల్లో అది రూ.3,820 పెరిగింది. దీన్ని బట్టీ... 4 నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 7-8-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,460 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,680 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.160 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,600 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.200 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,866 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.38,928 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర రూ.176 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,660 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.220 తగ్గింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 7-8-2021: వెండి ధర నిన్న కొద్దిగా తగ్గింది. గత 10 రోజుల్లో 6 సార్లు తగ్గగా... 3 సార్లు పెరిగింది. 1 సారి స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.71.70 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.573.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.777 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,170 ఉండగా... కేజీ వెండి ధర... రూ.71,700 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.600 తగ్గింది. ఏప్రిల్ 1న వెండి ధర కేజీ రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.71,700 ఉంది. అంటే 127 రోజుల్లో వెండి ధర రూ.4,400 పెరిగినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: అమెరికాలో మళ్లీ రోజూ లక్షకు పైగా కరోనా కేసులు వస్తుండటంతో... ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఈ కరోనా ఇప్పట్లో వదలదు... ఇక మన జీవితాలు ఇంతే అనే నిరాశ... ప్రపంచ దేశాల ప్రజల్లో వచ్చేసింది. దాంతో... అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల్ని వెనక్కి తీసేసుకుంటున్నారు. దాంతో అవి నిన్న కుప్పకూలాయి. ఇండియాలోని స్టాక్ మార్కెట్లపైనా ఆ ప్రభావం పడింది. నిన్న సెన్సెక్స్ 215 పాయింట్లు, నిఫ్టీ 56 పాయింట్లు నష్టపోయాయి. అంటే... ఇన్వెస్టర్లు రూ.2లక్షల కోట్లు వెనక్కి తీసేసుకున్నారని అనుకోవచ్చు. ఇండియాలో కరోనా పెరిగితే... స్టాక్ మార్కెట్లు మరింత నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి మళ్లీ కోలుకునే ఛాన్స్ కొంతవరకూ ఉన్నా... కరోనా పెరిగితే మాత్రం... ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి సమయంలో... నిఫ్టీ 50 తరహా కంపెనీలు మాత్రమే కాస్త గట్టెక్కగలవని అంచనా వేస్తున్నారు నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)