Gold Price today: బంగారం ధరలు అతి కష్టమ్మీద కాస్త తగ్గాయి. నిజానికి స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై రికార్డులకు చేరినప్పుడు బంగారం ధరలు బాగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలా జరగలేదు. కొద్దిగానే తగ్గాయి. వెండి కూడా తగ్గింది. ఈ సంవత్సరం సగం వరకూ బాగా పెరిగిన వెండి... జులైలో తగ్గడం మొదలుపెట్టి... డౌన్ ఫాల్ ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది. బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా అంటే... స్టాక్ మార్కెట్లు ఇలాగే దూసుకెళ్తే... పసిడి వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రెండ్ చూస్తే మరీ భారీగా తగ్గేలా కనిపించట్లేదు. అంతర్జాతీయంగా కరోనా తగ్గట్లేదు కాబట్టే ఈ పరిస్థితి ఉంది. కరోనా తగ్గిపోతే... బంగారం ధరలూ తగ్గుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరల్లో పెరుగుదల ఉంది. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.41,100 ఉండగా... 125 రోజుల్లో అది రూ.3,80 పెరిగింది. అలాగే... 24 క్యారెట్ల ప్యూర్ పెట్టుబడుల గోల్డ్ 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... 125 రోజుల్లో అది రూ.4,140 పెరిగింది. దీన్ని బట్టీ... 4 నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 4-8-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,490 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,920 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.72 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,900 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.90 తగ్గింది. చెప్పాలంటే ఇది పెద్ద తగ్గుదలే కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,898 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,184 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర రూ.88 తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,980 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.110 తగ్గింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 4-8-2021: వెండి ధర నిన్న కొద్దిగా తగ్గింది. గత 10 రోజుల్లో 5 సార్లు తగ్గగా... 3 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.72.70 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.581.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.727 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,270 ఉండగా... కేజీ వెండి ధర... రూ.72,700 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.400 తగ్గింది. ఏప్రిల్ 1న వెండి ధర కేజీ రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.72,700 ఉంది. అంటే 125 రోజుల్లో వెండి ధర రూ.5,400 పెరిగినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: సోమవారం, మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయ. సెన్సెక్స్ 872 పాయింట్లు బలపడగా... నిఫ్టీ 245 పాయింట్లు బలపడింది. అంటే ఇన్వెస్టర్లకు నిన్న 8 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లే. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆగస్టు నెల జీతాలు, వేతనాలే అనుకోవచ్చు. చాలా మంది జీతాలు తీసుకున్నవారు... ఆ డబ్బును స్టాక్ మార్కెట్లలో పెడుతున్నారు. అందువల్ల ఒక్కసారిగా మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. ఇవాళ కూడా కొంతవరకూ లాభాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నా... దేశంలో కరోనా కేసులు ఎలా ఉన్నాయి అనే అంశం ప్రభావం చూపించనుంది. కరోనా కేసులు పెరిగితే... సూచీలు నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... ఇన్వెస్టర్లు ఊరూ పేరూ తెలియని కంపెనీల్లో పెట్టుబడి పెడితే... ఆ తర్వాత అవి భారీగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)