Gold Rate today: మన దేశంలో మిగతా వస్తువులపై అంతర్జాతీయ అంశాల ప్రభావం పెద్దగా పడదు గానీ... సామాన్యులు ఏళ్ల తరబడి డబ్బు కూడబెట్టి ఏ పెళ్లి సమయంలో కొనుక్కుందామనుకునే బంగారంపై మాత్రం అంతర్జాతీయ అంశాల ప్రభావం బాగా పడుతుంది. దాంతో... ప్రతీ విషయానికీ బంగారం ధరలు పెరిగిపోతూ ఉంటాయి. ఏ యుద్ధ ప్రకటన వచ్చినా, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించినా, చమురు ధరలు పెరిగినా, స్టాక్ మార్కెట్లు కుదేలైనా... ఇలా ప్రపంచ దేశాల్లో ఏ సమస్య వచ్చినా బంగారం ధరలు పెరిగిపోతాయి. గత వారం తగ్గినట్లు కనిపించిన ధరలు మళ్లీ ఈ వారం పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 27-7-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,480 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,840 ఉంది. నిన్న 8 గ్రాముల ధర రూ.80 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,800 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.100 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,888 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,104 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర రూ.88 పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,880 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.110 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 27-7-2021: వెండి ధర నిన్న పెరిగింది. గత 10 రోజుల్లో 4 సార్లు తగ్గగా... 4 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.72.10 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.576.80 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.721 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,210 ఉండగా... కేజీ వెండి ధర... రూ.72,100 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. జూన్ 30న వెండి ధర కేజీ రూ.72,900 ఉంది. ఇప్పుడు రూ.72,100 ఉంది. అంటే ఈ 26 రోజుల్లో వెండి ధర రూ.800 తగ్గినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్ల విశ్లేషణ: గత వారం స్టాక్ మార్కెట్లు గురు, శుక్ర వారాల్లో భారీ లాభాలు సాధించాయి. ఆ లాభాల్ని వెనక్కి తీసుకునేందుకు ఇన్వెస్టర్లు సోమవారం ప్రయత్నించారు. ఫలితంగా నిన్న సెన్సెక్స్ 131 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లూ నష్టపోయాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పడిపోతే... దాదాపు లక్ష కోట్ల రూపాయలు నష్టపోయినట్లే. ఆ డబ్బు ఇన్వెస్టర్లకు చేరితే పర్వాలేదు కానీ... అలా జరగకపోతే బాధాకరమే. ఈ రోజు మార్కెట్ లాభాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నా... మరీ ఎక్కువ వెళ్లకపోవచ్చు అంటున్నారు. మధ్యలో క్యూ1 ఫలితాల కారణంగా కొన్ని కుదుపులు ఉంటాయని అంటున్నారు. షేర్లు కొనేవారు... ఏదైనా షేర్ 2020కి ముందు బాగా పెర్ఫార్మ్ చేసి... ఇప్పుడు మళ్లీ అది పైకి వెళ్తూ ఉంటే... అలాంటిది కొనుక్కోవచ్చని చెబుతున్నారు. అయితే... ఆ కంపెనీ ఇప్పుడు యాక్టివ్‌గా వ్యాపారం చేసేదై ఉండాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)