Gold Price: మనం అనుకున్నట్లే బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆగస్ట్ 12 నుంచి అంటే... 10 రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల నగలు కొనుక్కోవాలి అనుకునేవారు... ఇప్పుడే కొనుక్కోవాలి అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఇంకా ఆలస్యం చేస్తే ధరలు మరింత పెరగవచ్చు అంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు పెరుగుతున్నకొద్దీ బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Trend: గత 10 రోజుల్లో బంగారం ధరలు 1 రోజు మాత్రమే తగ్గాయి. 7 రోజులు పెరిగాయి. 2 రోజులు స్థిరంగా ఉన్నాయి. మరోలా ఆలోచిస్తే... గత 10 రోజుల్లో నగల బంగారం 10 గ్రాములు ధర రూ.900 పెరిగింది. ఇంకా పెరిగితే సామాన్య ప్రజలకు, నగలు కొనేవారికీ ఇబ్బందే. కాబట్టి... ఇప్పుడే నగలు కొనుక్కుంటే... భారం కాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,250 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,250 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,250 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,250 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,650కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,400 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,590 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,400 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 21-8-2021: వెండి ధర నిన్న కొద్దిగా తగ్గింది. గత 10 రోజుల్లో ధర 6 సార్లు తగ్గగా... 2 సార్లు పెరిగింది. రెండుసార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.67 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.536 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.670 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,700 ఉండగా... కేజీ వెండి ధర... రూ.67,000 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.400 తగ్గింది. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునేవారు ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఎందుకంటే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.67,000 ఉంది. అంటే... ఈ రెండున్నర నెలల కాలంలో ధర రూ.9,800 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)q
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లు నిన్న భారీ నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 118 పాయింట్లు లాస్ అయ్యింది. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు ఆవిరైంది. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే... ఆమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉందని ఫెడరల్ రిజర్వ్ తెలిపింది. అంటే అది అమెరికాకు చేదు వార్తే... అందువల్ల ప్రజలు... చేతిలో డబ్బు రెడీగా ఉంచుకోవాలని అనుకుంటారు. పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. నిన్న అదే జరిగింది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయారు. దాంతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. అందువల్ల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు... ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో గ్రహించాలి. అప్పుడే సక్సెస్ సాధ్యం అంటున్నారు నిపుణులు. (image credit - twitter - reuters)