Gold Price today: గత ఆరు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్నా... పెరగలేదు కాబట్టి... నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇది మంచి వార్తే. ఐతే... ఇంకా ధర తగ్గుతుందేమో అనే డౌట్ ఉండటం సహజం. నిపుణులు కూడా అదే చెబుతున్నారు. నగలు కొనుక్కోవాలి అనేవారు... మరి కొన్ని రోజులు ఆగవచ్చు అంటున్నారు. ఇందుకో ఫార్ములా చెబుతున్నారు. రోజూ బంగారం ధరలను గమనిస్తూ ఉంటాయి. ధర తగ్గుతూ ఉన్నంతకాలం... నగలు కొనకూడదు. కొన్ని రోజుల తర్వాత ధర పెరగడం మొదలవుతుంది. అలా వరుసగా 3 రోజులు పెరిగితే... అప్పుడు కొనుక్కోమని చెబుతున్నారు. ఎందుకంటే... అలా మూడు రోజులు పెరిగితే... ఇక ధర పెరుగుదల కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫార్ములా పాటించడం ద్వారా... నగలను తక్కువ ధరకు కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
గత 6 రోజుల్లో నగలకు వాడే బంగారం ధర రూ.1,550 తగ్గింది. కాబట్టి నగలు కొనుక్కునేవారు ఇప్పుడు కొనుక్కుంటే... 10 గ్రాములకు రూ.1,550 తక్కువకు కొనుక్కున్నట్లు అవుతుంది. ఇక మేకింగ్ ఛార్జెస్, తరుగు అంటూ కొంత అదనపు ఛార్జీలు వేస్తారు. వాటి భారం ఎలాగూ తప్పదు. లక్కేంటంటే... గత సంవత్సరం ఆగస్ట్ 11న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.53,140 ఉండగా... సంవత్సర కాలంలో అది రూ.9,790 తగ్గింది. అలాగే... 24 క్యారెట్ల ప్యూర్ పెట్టుబడుల గోల్డ్ 10 గ్రాములు గతేడాది ఆగస్ట్ 11న రూ.58,030 ఉండగా... సంవత్సర కాలంలో అది రూ.10,730 తగ్గింది. కాబట్టి... ఇప్పుడు నగలు కొనుక్కునే వారు... 10 గ్రాముల నగలు కొనుక్కుంటే... వారు రూ.9,790 తక్కువకు కొనుక్కున్నట్లు అవుతుంది. ఇది మంచి నిర్ణయమే కదా. నిపుణుల ప్రకారమైతే... ఇంకా ధర తగ్గుతుందేమో చూసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 11-8-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,335 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.34,680 ఉంది. నిన్న 8 గ్రాముల ధరలో మార్పు లేదు. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.43,350 ఉంది. నిన్న 10 గ్రాములు ధర స్థిరంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,730 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.37,840 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.47,300 ఉంది. నిన్న 10 గ్రాములు ధరలో మార్పు లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,350 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,800 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,500 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,750 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,280 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 11-8-2021: వెండి ధర నిన్న కూడా బాగానే తగ్గింది. గత 10 రోజుల్లో 6 సార్లు తగ్గగా... 3 సార్లు పెరిగింది. 1 సారి స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.68.20 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.545.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.682 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,820 ఉండగా... కేజీ వెండి ధర... రూ.68,200 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.500 తగ్గింది. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇది సరైన టైమ్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే... గత 10 రోజుల్లో కేజీ వెండి ధర రూ.4,200 పెరిగింది. అలాగే... గత 10 రోజుల్లో వెండి ధర కేజీకి రూ.9,000 తగ్గింది. అంటే... పెరుగుదల కంటే... తగ్గుదల రూ.4,800 ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఓ 100 గ్రాముల వెండి నగలు కొనుక్కుంటే... వారికి అవి రూ.480 తక్కువకే వచ్చినట్లు అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: స్టాక్ మార్కెట్లను చూస్తే... సైలెంట్‌గా లాభాల్లోకి వెళ్తున్నాయి. గత వారం చివర్లో, ఈ వారం ప్రారంభంలో లాభాల్లోనే ఉన్నాయి. అందువల్ల... ఇన్వెస్టర్లు సడెన్‌గా నిర్ణయం మార్చుకొని... ఈ నాలుగైదు రోజుల్లో వచ్చిన లాభాల్ని తీసేసుకుందాం అనుకున్నారంటే... ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్తాయి. విశ్లేషణ ప్రకారం చూస్తే... ఇవాళ అటు లాభాల్లోకి గానీ, ఇటు నష్టాల్లోకి గానీ వెళ్లే అవకాశాలు కనిపించట్లేదు. అద్భుతాలేమీ జరగట్లేదు. కాకపోతే... ఆసియా మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూసుకొని జాగ్రత్త పడాలి. అవి నష్టాల్లోకి వెళ్తే... ఇక్కడ మన స్టాక్ మార్కెట్లు కూడా లాస్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకటి మాత్రం నిజం... నిఫ్టీలో టాప్ 50 కంపెనీల్లో కొన్ని కంటిన్యూగా అప్ ట్రెండ్ చూపిస్తున్నాయి. వాటి గత 5 ఏళ్ల ట్రెండ్ అట్లాగే ఉంటోంది. కాకపోతే... వాటిలో వచ్చే లాభం తక్కువే. అయినా పర్వాలేదు... రిస్క్ తక్కువ ఉండాలి అనుకునేవారు... అలాంటి కంపెనీలను బాగా విశ్లేషించుకొని ఆ షేర్లు కొనుక్కుంటే మంచిదే అనే అభిప్రాయం నిపుణుల నుంచి వస్తోంది. (image credit - twitter - reuters)