1. కరోనా వైరస్ మహమ్మారి మీ ఆర్థిక పరిస్థితుల్ని దిగజారుస్తోందా? ప్రస్తుతం అవసరాలు తీరడానికి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉందా? డబ్బులు కావాలంటే చాలా మార్గాల్లో అప్పులు చేయొచ్చు. అయితే ఎక్కువగా వినిపించేది పర్సనల్ లోన్ మాత్రమే. ఇక ఇంట్లో బంగారం ఉంటే గోల్డ్ లోన్ వైపు మొగ్గుచూపుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. బంగారంపై ఇచ్చే రుణాలను సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తుంటాయి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు. పర్సనల్ లోన్‌తో పోలిస్తే గోల్డ్ లోన్ డిఫాల్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కస్టమర్ దగ్గర నగలు, కాయిన్స్, బార్స్ రూపంలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకొని బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇక పర్సనల్ లోన్ విషయానికి వస్తే వీటిని అన్ సెక్యూర్డ్ లోన్‌గా భావిస్తాయి బ్యాంకులు. ఇందుకు కారణం పర్సనల్ లోన్లను ఎలాంటి తాకట్టు లేకుండా ఇస్తాయి. అయితే పర్సనల్ లోన్ ఇచ్చేముందు కస్టమర్ల క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ లాంటివన్నీ చెక్ చేస్తాయి బ్యాంకులు. వడ్డీ రేట్లు వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9. కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌పైనా వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం 8.5 శాతం నుంచి 25 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. ఒక ఏడాది నుంచి ఐదేళ్ల వరకు కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్క్రమ్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
10. మరి ఈ రెండు లోన్లలో ఏది తీసుకుంటే బెటర్. మీ అవసరాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర బంగారం ఉన్నట్టయితే గోల్డ్ లోన్ తీసుకోవడమే మంచిది. వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. బంగారం లేకపోతే పర్సనల్ లోన్ ఎంచుకోవాలి. తక్కువ మొత్తంలో లోన్ కావాలనుకుంటే పర్సనల్ లోన్ తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)