గోల్డ్ లోన్ తీసుకోవడానికి ఇది మంచి సమయమా?
కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో గోల్డ్ లోన్స్ అందిస్తున్నాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అవసరమైన వారికి బంగారు రుణం తీసుకోవడానికి ఇది మంచి సమయం కావచ్చు. అయితే ఈ సమయంలో రుణం తీసుకోవడానికి గల కారణాన్ని బట్టి మంచి లేదా చెడు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఒక వ్యక్తి స్వల్పకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం గోల్డ్ లోన్ తీసుకుంటుంటే, అది రుణం తీసుకోవడానికి మంచి సమయం అని నిపుణులు తెలిపారు. ఓ నిపుణుడు మాట్లాడుతూ.. ‘పేమెంట్ సైకిల్లో పెరుగుదల కారణంగా, కొన్ని నెలల గ్యాప్‌ని కవర్ చేయాలని చూస్తున్న చిన్న వ్యాపారవేత్తకు, బంగారు రుణం తీసుకోవడం మంచిది’ అని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
* హయ్యర్ లోన్ టూ వ్యాల్యూ(LTV)
గోల్డ్ లోన్ మొత్తం తాకట్టుగా డిపాజిట్ చేసిన బంగారం విలువపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం NBFCలు 60 శాతం వరకు రుణాన్ని అందజేస్తున్నాయి. బ్యాంకులు 75 శాతం లోన్ టూ వ్యాల్యూ(LTV)ని అందిస్తాయి. అంటే బంగారం విలువ రూ.లక్ష ఉంటే, సదరు వ్యక్తి రూ.75,000 రుణ మొత్తాన్ని పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
* గోల్డ్ లోన్ వడ్డీ రేటు
అనేక బ్యాంకులు సంవత్సరానికి 8 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో బంగారు రుణాలను అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంవత్సరానికి 7 శాతం వడ్డీ రేటుతో మహా గోల్డ్ అనే బంగారు రుణ పథకాన్ని అందిస్తుంది. కస్టమర్లు గరిష్టంగా రూ.5 లక్షల రుణాన్ని, కనిష్టంగా రూ.20,000 రుణాన్ని పొందవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
గరిష్ట రీపేమెంట్ వ్యవధి 12 నెలల వరకు ఉంటుంది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సంవత్సరానికి 7.50 శాతం వడ్డీ రేటుతో SBI పర్సనల్ గోల్డ్ లోన్, SBI రియల్టీ గోల్డ్ లోన్ అనే రెండు బంగారు రుణాలను అందిస్తుంది. ఈ పథకాల కింద గరిష్ట రుణం మొత్తం రూ.50 లక్షలు కాగా, కనీస రుణం మొత్తం రూ.20,000 అందుతుంది. రుణాలను 12 నుంచి 36 నెలల లోపు తిరిగి చెల్లించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
కెనరా బ్యాంక్ మూడు బంగారు రుణ పథకాలను స్వర్ణ గోల్డ్ లోన్ స్కీమ్, అగ్రికల్చర్ గోల్డ్ లోన్ స్కీమ్, MSME గోల్డ్ లోన్ స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రుణాల వడ్డీ రేటు సంవత్సరానికి 7.35 నుంచి 7.65 శాతం మధ్య ఉంటుంది. ఈ పథకాల కింద లభించే గరిష్ట రుణ మొత్తం రూ.35 లక్షలు కాగా, కనిష్ట మొత్తం రూ.5,000. రుణాలను 6 నెలల నుంచి 2 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. ఇంతలో NBFCలు ఇప్పుడు 10 శాతానికి రుణ రేట్లను పెంచాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ అనే రెండు NBFCలు తమ అంచనాలు యథాతథంగా ఉంచాయి. 2021 అక్టోబరులో ముత్తూట్ ఫైనాన్స్ మణప్పురం ఫైనాన్స్ రాబోయే ఐదేళ్లలో బంగారం ధరలతో సంబంధం లేకుండా కనీసం 10-12 శాతం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్(CAGR)తో చూపగలవని బ్రోకరేజ్ హౌస్ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)