1. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిన ప్రతీసారి కొన్ని ముఖ్యమైన కొత్త రూల్స్ (New Rules) అమలులోకి వస్తుంటాయి. చాలావరకు అవన్నీ డబ్బుకు సంబంధించినవే (Money Rules) ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1నే కొత్త బడ్జెట్ అమలులోకి వస్తుంది. ఇది కాకుండా ఇంకా డబ్బుతో ముడిపడ్డ అనేక అంశాల్లో కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Income Tax: ఆదాయపు పన్ను శ్లాబ్స్‌లో మార్పులు అమలులోకి వచ్చాయి. బడ్జెట్ 2023లో కొత్త పన్ను విధానంలో శ్లాబ్స్ మారిన సంగతి తెలిసిందే. ఇకపై కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఉంటుంది. పాత పన్ను విధానంలో కొనసాగాలనుకుంటే తప్పనిసరిగా ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పన్ను విధానంలో రిబేట్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. LTCG tax: డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. భారతీయ ఈక్విటీల్లో 35 శాతం కన్నా తక్కువ ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చిన క్యాపిటల్ గెయిన్స్‌ను మీ ఆదాయంలో కలిపి, మీ శ్లాబ్ రేట్ ప్రకారం పన్ను వసూలు చేస్తుంది ప్రభుత్వం. మార్చి 31 వరకు డెట్ ఫండ్స్ ద్వారా పొందిన క్యాపిటల్ గెయిన్స్‌ను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. Savings Schemes: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) గరిష్ట పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం ద్వారా 8.2 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఇక పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లిమిట్‌ను 4.5 లక్షల నుంచి రూ.9 లక్షలు చేసింది ప్రభుత్వం. జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షల వరకు పొదుపు చేయొచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ ద్వారా 7.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. NPS Rules: నేషనల్ పెన్షన్ స్కీమ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే మరిన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) పలు డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేయడం తప్పనిసరి చేసింది. వాటిని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలో అప్లోడ్ చేసి ఎన్పీఎస్ డబ్బుల్ని విత్‌డ్రా చేయొచ్చు. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, విత్‌డ్రాయల్ ఫామ్, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
7. Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేట్ పెంచేందుకు కసరత్తు చేస్తోందని వార్తలొస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరగబోయే తొలి ద్రవ్యపరపతి విధాన సమావేశంలో రెపో రేట్‌ను పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్ 6న ఈ నిర్ణయం రాబోతోంది. ఇప్పటికే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెపో రేట్‌ను 250 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం 6.50 శాతానికి రెపో రేట్ చేరుకుంది. మరో 25 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెరగొచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
9. Savings Account: యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, సాలరీ అకౌంట్లకు కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. ప్రెస్టీజ్ సేవింగ్స్ అకౌంట్స్‌కు యావరేజ్ బ్యాలెన్స్ మారుతుంది. ఇప్పటి వరకు రూ.75,000 గా ఉన్న యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అవుతుంది. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే చెల్లించాల్సిన ఛార్జీలను కూడా సవరించింది యాక్సిస్ బ్యాంక్. ప్రస్తుతం రూ.0 నుంచి రూ.600 ఛార్జీలు ఉండగా ఇకపై రూ.50 నుంచి రూ.600 ఛార్జీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)