1. బంగారం కొన్నా మోసపోతారు, అమ్మినా మోసపోతారు అని అంటారు. అందుకే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. నగలపై హాల్మార్కింగ్ తప్పనిసరి చేసింది. జూన్ 15 నుంచి నగలపై హాల్మార్క్ రూల్ అమలు చేయాల్సిందేనని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇటీవల మరోసారి గడువు పొడిగించింది. జూన్ 15 నుంచి ఇక తప్పనిసరిగా హాల్మార్క్ నగలను మాత్రమే అమ్మాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై నగల షాపుల్లో హాల్మార్క్ లేని నగలను షాపులో అమ్మకూడదు. నగల వ్యాపారులు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. వర్క్ షాప్లో బంగారు నగలను తయారు చేసి, నాణ్యత పరీక్ష కోసం హాల్మార్క్ సెంటర్కు పంపిస్తారు. అక్కడ నగలను పరిశీలించి హాల్మార్క్ వేస్తారు. 22 క్యారట్ అని చెప్పి 18 క్యారట్ బంగారంతో నగలు తయారు చేసినట్టైతే హాల్మార్క్ సెంటర్లో దొరికిపోతారు. కాబట్టి మోసం జరిగే అవకాశం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)