పసిడి డిమాండ్ ఏకంగా 11 ఏళ్ల గరిష్టానికి చేరింది. అంటే ధరల పెరుగుదల ప్రభావం పసిడి డిమాండ్‌పై లేదని చెప్పుకోవచ్చు. గ్లోబల్‌గా గోల్డ్ డిమాండ్ గత ఏడాదిలో వార్షికంగా చూస్తే.. ఏకంగా 18 శాతం పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంటోంది. 4741 టన్నులకు చేరిందని తెలిపింది. 2011 నుంచి చూస్తే.. ఇదే గరిష్టమని తెలియజేసింది.
కేంద్ర బ్యాంకులు గత ఏడాది ఏకంగా 1136 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2021లో చూస్తే ఈ కొనుగోళ్లు కేవలం 450 టన్నులు మాత్రమే. అంటే కేంద్ర బ్యాంకులు ఏ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేశాయో అర్థం చేసుకోవచ్చు. 55 ఏళ్ల రికార్డ్ స్థాయిలో కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంటోంది.
అయితే గత ఏడాదిలో జువెలరీ డిమాండ్ మాత్రం కాస్త తగ్గింది. 3 శాతం క్షీణించింది. 2086 టన్నులుగా నమోదు అయ్యింది. చైనాలో జువెలరీ డిమాండ్ తగ్గడం ఇందుకు కారణం. చైనాలో లాక్ డౌన్ వల్ల ఇది చోటుచేసుకుంది. కాగా ఆర్థిక మాంద్యం భయాలు నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు బంగారాన్ని తెగ కొనేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.