సావరిన్ స్కీమ్ (Sovereign Gold Bond Scheme) 2021-22కు సంబంధించిన వివరాలను (Reserve Bank Of India-RBI) ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఇష్యూ ధరను గ్రాము బంగారానికి రూ.5,109గా నిర్ణయించినట్లు శుక్రవారం ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ప్రకటించిన సావరిన్ గోల్డ్ స్కీమ్ ఈ సిరీస్‌లో పదోది. వచ్చే సోమవారం నుంచి ఐదు రోజులపాటు సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22కు సబ్స్క్రిప్షన్ చేసుకొనే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఆన్లైన్ ద్వారా స్కీమ్ అప్లై చేస్తున్న ఇన్వెస్టర్లకు, అదే విధంగా డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు చేసిన వారికి గ్రాము బంగారంపై డిస్కౌంట్ ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తున్న ఇన్వెస్టర్లు, డిజిటల్ పద్ధతిలో పేమెంట్స్ చేసిన వారికి గ్రాము బంగారంపై రూ.50 ప్రత్యేక డిస్కౌంట్ అందనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆన్లైన్లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22కు అప్లై చేస్తున్న ఇన్వెస్టర్లు, డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారికి ఈ స్కీమ్‌లో గ్రాము బంగారం ఇష్యూ ధర రూ.5,059గా ఉంటుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 సిరీస్‌లో 9విడతలో గ్రాము బంగారం ఇష్యూ ధర రూ.4,786గా ఉంది. అది అంతకు ముందు వచ్చిన 8వ విడత కంటే రూ.5 తక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)
తొమ్మిదో విడత గోల్డ్ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్‌కు జనవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆ సమయంలో కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసే వారిని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ రూ.50 ప్రత్యేక డిస్కౌంట్ అందించాయి. వారికి 9వ విడత స్కీమ్‌లో గ్రాము బంగారం ఇఫ్యూ ధర రూ.4,736గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రకటిస్తుంది. ఈ బాండ్లు బ్యాంక్స్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SHCIL), కొన్ని పోస్టాఫీస్‌లు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్లు అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇండియా ఎక్కువగా గోల్డ్ దిగుమతి చేసుకొంటోంది. ఈ క్రమంలో దేశంలో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సావరిన్ గోల్డ్ స్కీమ్‌లను 2015 నుంచి కేంద్రం, ఆర్బీఐ అమలు చేస్తున్నాయి. పొదుపు చేయడం, పెట్టుబడుల్లో భాగంగా గోల్డ్ కొనకుండా, ఇలా బాండ్లు ఇఫ్యూ చేయడంతో మేలని భావించాయి. పెట్టుబడులు పెట్టే లక్ష్యం నెరవేరుతుందని, ఫిజికల్ గోల్డ్ డిమాండ్ కూడా తగ్గుతుందని భావించాయి. అదే విధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేలా ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)