1. గోల్డ్ రేట్ (Gold Rate Today) దారుణంగా పతనం అవుతోంది. గతేడాది గోల్డ్ కొనాలంటే వామ్మో అన్నారు. కానీ... ఇప్పుడు బంగారం ధర రోజురోజుకీ పడిపోతోంది. గతేడాది రికార్డు ధరతో పోలిస్తే... ఇప్పుడు బంగారం సుమారు రూ.11,000 తక్కువకే లభిస్తోంది. స్వచ్ఛమైన బంగారంతో పాటు, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రేట్ కూడా అదే స్థాయిలో పడిపోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఏడాది క్రితం 2020 ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 కి చేరుకొని రికార్డు సృష్టించింది. ఆ తర్వాత భారీగా గోల్డ్ రేట్ పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో 2 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.43,300. రికార్డు ధర నుంచి 22 క్యారట్ గోల్డ్ రూ.10,900 తక్కువకే గోల్డ్ లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)