1. పసిడిప్రేమికులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధర ఒక్క రోజులో రూ.250 తగ్గితే వెండి ధర కిలోపై రూ.900 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర 10 గ్రాములపై రూ.250 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారట్ గోల్డ్ ధర రూ.49,340. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఇక స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ.250 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.53,820. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ.900 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.67,000. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర 1.05 శాతం అంటే రూ.545 తగ్గి రూ.51,170 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధర 2.00 శాతం అంటే రూ.1,357 తగ్గి రూ.66,520 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,932.30 డాలర్లు కాగా ఔన్స్ వెండి ధర 26.45 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)