1. గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో గోల్డ్ రేట్ కాస్త తగ్గినట్టు కనిపించినా కార్తీక మాసంలో పెళ్లిళ్లి సీజన్లో బంగారం ధరలు పెరగడం మొదలైంది. పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత కూడా గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. వెండి ధరది కూడా అదే దారి. సిల్వర్ రేట్ భారీగా పెరుగుతోంది. (image: Reliance Jewels)
3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.300 పెరగడంతో రూ.54,630 నుంచి రూ.54,930 ధరకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారం ధర మళ్లీ రూ.55,000 మార్క్‌కు చేరువవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు మాత్రమే కాదు, వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. శుక్రవారం కిలో వెండిపై రూ.500 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,500. రెండు నెలల్లో కిలో వెండి ధర రూ.14,000 పెరిగింది. (image: Reliance Jewels)
4. నవంబర్ 4 నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.50,350 ధరకు చేరుకుంది. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు రూ.4,250 పెరిగింది. ఇక అదే రోజున 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.54,930 ధరకు చేరుకుంది. అప్పటి నుంచి రూ.4,440 పెరిగింది. (image: Reliance Jewels)
6. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగితే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధర రూ.55,000 దిగువలో ఉండగా, వెండి ధర రూ.70,000 దిగువలో ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.03 శాతం అంటే రూ.17 తగ్గి రూ.54,954 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.19 శాతం అంటే రూ.135 తగ్గి రూ.69,632 దగ్గర ట్రేడ్ అవుతోంది. (image: Reliance Jewels)