GOLD AND SILVER PRICES RISING IN HYDERABAD AND MCX KNOW LATEST RATES SS
Gold Price Today: మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
Gold Rate Today | బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగిపోతున్నాయి. వెండి కూడా భారీగా పెరుగుతోంది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. బంగారం ధర ఇంకా తగ్గుతుందని ఎదురుచూసిన పసిడిప్రేమికులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర మళ్లీ పెరిగింది. వెండి రేటు కూడా పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర ఇటీవల రూ.49,000 కన్నా దిగొచ్చింది. కానీ రేటు మళ్లీ పెరిగింది. ప్రస్తుతం 22 క్యారట్ గోల్డ్ ధర రూ.160 పెరిగి రూ.49,070 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఇక స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.180 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.53,530. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. మరోవైపు ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై ఒక్క రోజులో రూ.400 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.68,300. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. ఇక మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర 0.34 శాతం అంటే రూ.175 పెరిగి రూ.51,494 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఎంసీఎక్స్‌లో సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కిలోపై 0.61 శాతం అంటే రూ.412 పెరిగి రూ.68,340 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,946.80 డాలర్లు కాగా ఔన్స్ వెండి ధర 26.99 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)