Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారు ఆభరణాలు కొనాలనుకుంటున్నారా? రేటు దూసుకెళ్తోంది. వెండి వస్తువులు తీసుకోవాలనుకుంటున్నారా? సిల్వర్ రేట్ కూడా భారీగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.
1. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర రెండు రోజుల్లో రూ.500, కిలో వెండి రూ.2,100 పెరిగింది. శుక్రవారం హైదరాబాద్‌లో బంగారం ధర 10 గ్రాములపై రూ.120 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.47,870 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.44,840. శుక్రవారం హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.2,100 ధర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.45,250. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. బంగారం ధర రూ.50,000 వైపు దూసుకెళ్తుంటే వెండి ధర రూ.45,000 మార్క్‌ను దాటింది. మరోవైపు మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. శుక్రవారం గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర 0.48 శాతం అంటే రూ.226 పెరిగి రూ.46,880 ధరకు చేరుకుంది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ ఏకంగా 2.95 శాతం అంటే రూ.1,300 పెరిగి రూ.45,435 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
5. గత నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.47,000 మార్క్‌ను దాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా గోల్డ్ అదే స్థాయిలో దూసుకెళ్తోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1732 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 15.97 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)