ఇవాల్టి బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర ఇప్పటికే 50 వేల రూపాయలకు చేరువలో ఉంది. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం తులం ధర 49,530 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,400గా ఉంది.
ఇక.. విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,530 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.45,400 వద్ద నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఇదే మాదిరిగా ఉన్నాయి. ఢిల్లీలో బుధవారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,530 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.45,400గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,400గా ఉంది. కోల్కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,530 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,400 పలుకుతోంది. మైసూరు, మంగుళూరు, కేరళలో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.49,530 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,400 రూపాయలు పలుకుతోంది.
బంగారం ధర ఇలా పెరగ్గా.. వెండి ధర కూడా నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ భారీగా పెరిగింది. మంగళవారం నాడు కిలో వెండి ధర రూ.61,600గా ఉండగా, బుధవారం ఆ ధర రూ.61,900కి పెరిగింది. అంటే.. బుధవారం నాడు (ఫిబ్రవరి 9) కిలో వెండిపై 300 రూపాయలు పెరగడం గమనార్హం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో అయితే వెండి ధర మరింత ప్రియంగా ఉంది.