1. గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. వారం రోజుల్లో గోల్డ్ రేట్ రూ.1200 పైనే పెరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ బంగారం ధర తగ్గింది. బంగారం ధర మాత్రమే కాదు, వెండి ధర కూడా భారీగా పడిపోయింది. గత వారం రోజుల్లో కిలో వెండి ధర ఏకంగా రూ.4,500 పెరిగిన సంగతి తెలిసిందే. (image: Reliance Jewels)
4. హైదరాబాద్‌లో బంగారం ధరలు మాత్రమే కాదు, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి రూ.71,000 మార్క్ దిగువకు చేరుకుంది. కిలో వెండిపై ఒక్క రోజులో రూ.1,700 తగ్గడంతో రూ.72,500 నుంచి రూ.70,800 ధరకు చేరుకుంది. అంతకన్నా ముందు వారం రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.4,500 పెరిగిన సంగతి తెలిసిందే. (image: Reliance Jewels)
5. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గితే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరిగాయి. బంగారం ధర రూ.53,000 మార్క్ చేరువలో ఉండగా, వెండి ధర రూ.65,000 మార్క్ దాటింది. గోల్డ్ 2023 ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.27 శాతం అంటే రూ.143 పెరిగి రూ.53,648 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మార్చి ఫ్యూచర్స్ 0.56 శాతం అంటే రూ.364 పెరిగి రూ.65,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. (image: Reliance Jewels)
6. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1800 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,770.10 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఔన్స్ సిల్వర్ ధర 23 డాలర్ల మార్క్ దిగువలో ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ 22.40 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. (image: Reliance Jewels)