1. ఆల్ టైమ్ హై నుంచి బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతూనే ఉంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.61,000 మార్క్ దిగువలో ఉండగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రూ.55,000 మార్క్‌ను సమీపిస్తోంది. ఇక వెండి ధర రూ.76,000 మార్క్‌కు దగ్గరవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. శుక్రవారం హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.55,800 నుంచి రూ.55,650 ధరకు చేరుకుంది. ఇక స్వచ్ఛమైన బంగారం ధర రూ.61,000 మార్క్ దిగువలోనే ఉంది. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,870 నుంచి రూ.60,710 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మరోవైపు వెండి ధర కూడా భారీగా పతనం అవుతోంది. శుక్రవారం కిలో వెండిపై ఏకంగా రూ.300 తగ్గడంతో రూ.76,500 నుంచి రూ.76,200 ధరకు చేరుకుంది. తులం వెండి ధర రూ.762 ధరకు లభిస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి నగరాల్లో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మే 5న బంగారం ధరలు ఆల్ టైమ్ హై చేరుకున్నాయి. అక్కడ్నుంచి ధరలు తగ్గుతున్నాయి. ఆ రోజున 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.57,200 ధరకు, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.62,400 ధరకు చేరుకున్నాయి. అదే రోజు కిలో వెండి ధర రూ.83,700 ధరకు చేరుకుంది. అక్కడ్నుంచి బంగారం ధర రూ.1,500 పైనే తగ్గగా, వెండి ధర రూ.7,500 పతనం అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గితే, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరిగాయి. గోల్డ్ 2023 జూన్ ఫ్యూచర్స్ 0.08 శాతం అంటే రూ.50 పెరిగి రూ.59,510 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 జూలై ఫ్యూచర్స్ 0.34 శాతం అంటే రూ.240 తగ్గి రూ.70,482 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)