నేటి బంగారం ధరలు (30-11-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.47,250 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.37,800 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,725 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,250 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.38,600 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,825 ఉంది.
నేటి వెండి ధరలు (30-11-2020): వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఏడాది నుంచి మాత్రం వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.59,200 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పులేదు. తులం వెండి ధర ప్రస్తుతం రూ.473.60 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.59.20 ఉంది.
ఇన్వెస్టర్లకు అలర్ట్: బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇండియాలో బంగారానికి డిమాండ్ బాగానే ఉన్నా... విదేశాల్లో పరిస్థితులు బాగోలేవు. ప్రధానంగా కరోనా సహా అనేక అంశాల ప్రభావం బంగారంపై పడుతోంది. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ తగ్గుదల దాదాపు 2 నెలల పాటూ కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక దృష్టితో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి తప్ప... స్వల్పకాలానికి పెడితే మాత్రం భారీ రిస్క్ తప్పదంటున్నారు విశ్లేషకులు.