Gold and Silver Price Today: అంతర్జాతీయంగా, దేశీయంగా కరోనా వ్యాక్సిన్ల ట్రయల్స్ సత్ఫలితాలు ఇస్తుంటే... డాలర్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఇన్వెస్టర్లు... బంగారంపై పెట్టుబడులను వెనక్కి తీసుకొని... ఇతర మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంతో... అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇండియాలో గత 6 రోజులలో... ఐదు రోజులు ధరలు తగ్గగా... ఒక్క రోజు మాత్రం చాలా స్వల్పంగా మాత్రమే పెరిగాయి. మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
నేటి బంగారం ధరలు (29-11-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,000 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.450 తగ్గింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,000 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.360 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,500 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,090 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.490 తగ్గింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.39,272 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.392 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,909 ఉంది.
నేటి వెండి ధరలు (29-11-2020): వెండి ధరలు కొన్నిసార్లు తగ్గుతూ, కొన్నిసార్లు పెరుగుతూ ఉన్నాయి. ఏడాది నుంచి చూస్తే మాత్రం వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,700 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పులేదు. తులం వెండి ధర ప్రస్తుతం రూ.517.60 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.64.70 ఉంది. సెప్టెంబర్ 24న వెండి ధర అత్యల్పంగా కేజీ రూ.57,000 ఉంది. అప్పటితో పోల్చితే... ప్రస్తుతం వెండి ధర రూ.7,700 ఎక్కువగా ఉంది.
బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చా: సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా చెప్పుకునే బంగారం ఇప్పుడు షాక్ ఇస్తోంది. జనవరి నుంచి పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్స్... ఆగస్ట్ 7న అత్యంత ఎక్కువకు చేరాయి. అప్పుడు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు రూ.59,130 ఉంది. ఆ తర్వాత నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ధర రూ.49,090 ఉంది. అంటే... మూడు నెలల కాలంలో ధర రూ.10వేల దాకా పడిపోయింది. అందుకే ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లు ఇతరత్రా మార్గాల్ని ఎంచుకుంటున్నారు. మున్ముందు కూడా ధరలు ఇలాగే పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు.