Gold and Silver Price Today: బంగారం ధరలు తగ్గడం అనేది సామాన్య, మధ్య తరగతి వారికి కలిసొచ్చే అంశం. గతేడాది ఇదే సమయంలో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం, కరోనా బాగా ఉండటంతో... చాలా మంది నగలు కొనుక్కోవాలనుకొని కూడా వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మాత్రం బంగారం ధరలు బాగా దిగివస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు నగలు కొనుక్కోవాలా... మరికొంత కాలం ఆగాలా అని ఎదురుచూస్తున్నారు. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి బంగారం ధరలు (13-2-2021): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.44,250 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.300 తగ్గింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.35,400 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.240 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,425 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,290 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.310 తగ్గింది. తులం బంగారం కావాలంటే దాని ధర రూ.38,632 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.248 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,829 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి వెండి ధరలు (13-2-2021): వెండి ధరలు గత 10 రోజుల్లో... 4 సార్లు తగ్గగా, 6సార్లు పెరిగాయి. నిన్న కొద్దిగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73,300 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.400 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.586.40 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.3.20 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.73.30 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
నగలు కొనవచ్చా?: బంగారం ధరలు పడిపోతున్నాయి కాబట్టి... ఇప్పట్లో గోల్డ్‌పై ఎవరూ పెట్టుబడి పెట్టరు. ఉన్న పెట్టుబడులు కూడా తరలిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా ఆరు నెలలకు పైగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. రూ.10వేలకు పైగా ధరలు తగ్గాయి. ఇంకా తగ్గే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. కాబట్టి నగలు కొనుక్కోవాలనుకునేవారు ఇప్పుడు కొనుక్కోవచ్చనీ... ఇంకా ఎదురుచూసి... తిరిగి ధరలు పెరుగుతున్న సమయం చూసి కొనుక్కున్నా పర్వాలేదని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)