Gold and Silver Price Today: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి... ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగడంతో... చాలా మంది పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్‌గా బంగారాన్ని ఎంచుకున్నారు. దాంతో... నిన్న బంగారం ధరలు రివ్వున దూసుకెళ్లాయి. అదే సమయంలో వెండి ధరలు అత్యంత భారీగా పెరిగాయి. ఐతే... ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేక ధరలు మళ్లీ తగ్గుతాయా అన్న ప్రశ్నలకు అంతర్జాతీయ అంశాల ప్రభావాన్ని బట్టీ సమాధానం దొరకనుంది.
నేటి బంగారం ధరలు (9-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,600 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.700 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.37,280 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.560 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,660 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,830 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.760 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,664 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.608 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,083 ఉంది.
నేటి వెండి ధరలు (9-12-2020): వెండి ధరలు వరుసగా రెండు రోజులు తగ్గి మళ్లీ భారీగా పెరిగాయి. 2 రోజుల్లో రూ.4,500 దాకా తగ్గినా... నిన్న ఏకంగా 6,500 పెరిగింది. ఈమధ్య కాలంలో ఇంతలా వెండి ఎప్పుడూ పెరగలేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,500 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.6,500 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.556 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.52 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.69.50 ఉంది.
కరోనా ప్రభావం: కరోనా వైరస్‌కి అధికారిక వ్యాక్సిన్ వస్తే... బంగారం ధరలు పడిపోతాయని మొదట్లో బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. కానీ... వ్యాక్సిన్ వచ్చాక... బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. నిపుణుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇందుకు కారణం అమెరికా, యూరప్ దేశాలే. అక్కడ కరోనా కేసులు, మరణాలూ బాగా పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కరోనాను కంట్రోల్ చెయ్యడానికి ఎన్ని నెలలు పడుతుందో అనే టెన్షన్లు ఉండటంతో... సేఫ్ ఆప్షన్‌గా పెట్టుబడులకు బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దానికి తోడు బంగారం ధరలు ఆ మధ్య 10వేల దాకా తగ్గాయి. అందువల్ల మళ్లీ పెరుగుతాయనే అంచనాతో చాలా మంది గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా ధరలు మళ్లీ దూసుకుపోతున్నాయి. రిస్కైనా పర్వాలేదు అనుకునేవారు బంగారంపై పెట్టుబడులు పెట్టుకోవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు.