Gold and Silver Price Today: బంగారం ధరలు ఇవాళ కొద్దిగా పెరిగాయి. ఐతే... నవంబర్ 30 నుంచి గోల్డ్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి. 12 రోజుల్లో నగల బంగారం ధర రూ.6వేల దాకా పెరిగింది. అంటే... ఇప్పుడు పెరిగే ట్రెండ్ కనిపిస్తోంది అనుకోవచ్చు. ఆగస్ట్ 7న బంగారం ధరలు అత్యధిక రేటుకి చేరాయి. అప్పట్లో నగల బంగారం ధర 10 గ్రాములు రూ.54,200 ఉండేది. అది ఇప్పుడైతే రూ.45,910 మాత్రమే ఉంది. అంటే... దాదాపు రూ.8వేలకు పైగానే తక్కువ ఉంది. కానీ ఇప్పుడు పెరిగే ట్రెండ్ కనిపిస్తోంది కాబట్టి... మున్ముందు ధర పెరిగితే... అప్పుడు ఇంత తక్కువ రేటుకి బంగారం లభించదు అనుకోవచ్చు.
నేటి బంగారం ధరలు (7-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,910 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,728 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,591 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,080 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,064 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,008 ఉంది.
నేటి వెండి ధరలు (7-12-2020): వెండి ధరలు అత్యంత భారీగా పతనం అయ్యాయి. ఈమధ్య కాలంలో ఇంతలా వెండి ఎప్పుడూ పడిపోలేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.63,900 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.3610 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.511.20 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర 28.88 తగ్గింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.63.90 ఉంది.
బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా: ఈ రోజుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. రకరకాల మొబైల్ యాప్స్ కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఐతే... ఆగస్ట్ 7 తర్వాత నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. కరోనాకి వ్యాక్సిన్ వస్తే... భారీగా పడిపోతాయనే అంచనాలు వచ్చాయి. ఐతే... వ్యాక్సిన్ వస్తున్న సమయంలో... ధరలు పెరుగుతూ... అంచనాలకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ పెరుగుదల ట్రెండ్ 12 రోజుల నుంచి కనిపిస్తోంది. మధ్యలో ఒకట్రెండు సార్లు ధర తగ్గినా... అది చాలా తక్కువగానే ఉంది. ఇకపైనా ఇలాగే ధర పెరుగుతుందా అంటే అనుమానమే. ప్రపంచ ఇన్వెస్టర్లు తీసుకునే నిర్ణయాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్ల ఇన్వెస్టర్లు అన్ని అంశాల్నీ గమనిస్తూ, పరిశీలిస్తూ... పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం మేలు అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు.