Gold and Silver Price Today: బంగారం కొనుగోళ్లు ఈ వారంలో కొద్దిగా పెరిగాయి. నిజానికి ఇంకా ఎక్కువగానే పెరుగుతాయనే అంచనా ఉన్నా... ఆ స్థాయిలో బిజినెస్ జరగలేదు. బంగారం ధర గత వారం తగ్గినట్లే తగ్గి... ఆ తర్వాత వరుసగా 4 రోజులు పెరగడంతో... కొనాలా, వద్దా అనే విషయంలో ప్రజలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అంతర్జాతీయంగా అప్పుడే రష్యాలో కరోనాకి వ్యాక్సిన్ పంపిణీ జోరందుకుంది. ఈ వారంలో బ్రిటన్‌లో ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ పంపిణీ మొదలవ్వనుంది. ఇలా కరోనాపై విజయం సాధిస్తూపోయే కొద్దీ బంగారం ధరలు తగ్గుతాయనే అంచనా ఉంది. ఐతే... బంగారం ధరలు తగ్గుతాయనుకున్న సమయంలో పెరగడం వల్ల అంచనాలు తారుమారయ్యాయి. మున్ముందు తగ్గుతాయా, పెరుగుతాయా అంటే... తగ్గుతాయనే అంటున్నారు విశ్లేషకులు.
నేటి బంగారం ధరలు (6-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,900 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.200 తగ్గింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,720 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.160 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,590 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,070 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.220 తగ్గింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,056 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.176 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,007 ఉంది.
వ్యాపారుల నుంచి డిమాండ్: సమీప భవిష్యత్తులో ప్రజలు బంగారం బాగా కొంటారని అంచనా వేస్తున్న వ్యాపారులు... భారీ ఎత్తున బంగారం కొంటున్నారు. ఐతే... నాలుగు రోజులపాటూ బంగారం ధరలు పెరగడంతో... వారు షాక్ అయ్యారు. స్టాక్ పెట్టుకోవాలా వద్దా అనే డౌట్ వచ్చింది. పక్క దేశం బంగ్లాదేశ్‌లో బంగారానికి డిమాండ్ బాగా పడిపోవడంతో... ఆ దేశం... వారం గ్యాప్‌లో రెండుసార్లు బంగారం ధరలను అన్ని కేటగిరీల్లోనూ బాగా తగ్గించింది. అటు చైనాలో కూడా బంగారం కొంటే... ఔన్సుకు 20 డాలర్ల డిసౌంట్ ఇస్తున్నారు. హాంకాంగ్‌లో బంగారం ధరను కొద్దిగా మాత్రమే పెంచారు. గత సోమవారం... 5 నెలల కనిష్టానికి బంగారం ధరలు పడిపోయాయి. ఆ తర్వాత మళ్లీ పెరిగాయి. భవిష్యత్తులో ధరలు తగ్గుతాయనే అంచనా ఉన్నందువల్ల... కొన్ని రోజుల తర్వాత... బంగారం కోసం జ్యువెలరీ సంస్థల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.