Gold and Silver Price Today: ప్రపంచవ్యాప్తంగా కరోనా మూడే రోజులు దగ్గరపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా, భారత్ సహా చాలా దేశాలు వ్యాక్సిన్ పంపిణీకి రెడీ అవుతున్నాయి. ముందుగా బ్రిటన్లో వచ్చే వారం వ్యాక్సిన్ పంపిణీ జరగబోతోంది. అది సక్సెస్ అయ్యి... కరోనా కంట్రోల్ అయితే... ఇక ప్రపంచ మార్కెట్లు, కరెన్సీలు, చమురు రంగాలు రయ్యిన దూసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వాటిపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు... బంగారంపై ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఐతే... ప్రస్తుతానికి మాత్రం బంగారాన్నే నమ్ముకుంటున్నారు. అందువల్లే నాలుగు రోజులుగా గోల్డ్ రేట్స్ దూసుకెళ్తున్నాయి. తాజాగా నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేటి బంగారం ధరలు (5-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,100 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.200 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,880 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.160 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,610 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,290 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.220 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,232 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.176 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,029 ఉంది.
పెట్టుబడి పెట్టాలా వద్దా?: బంగారంపై పెట్టుబడి పెట్టాలా వద్దా అనే అంశం ఇప్పుడు అంతుబట్టని విధంగా ఉంది. నిజానికి కరోనాకి వ్యాక్సిన్ వస్తే... బంగారం ధరలు తగ్గుతాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ... వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ధరలు నాలుగు రోజులుగా పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం... దేశీయంగా బంగారం కొనుగోళ్లు పెరగడమే. ఆగస్టు 7న నగల బంగారం (22 క్యారెట్లు) 10 గ్రాములు రూ.54,200 ఉంది. నవంబర్ 30న అది రూ.44,700 మాత్రమే ఉంది. అంటే ధర రూ.9వేల కంటే తగ్గింది. అందువల్ల దేశీయంగా బంగారం కొనుగోళ్లు బాగా పెరిగాయి. దాంతో... గోల్డుకి డిమాండ్ పెరిగి... డిసెంబర్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయి. ఆగస్ట్ 7తో పోల్చితే... ఇప్పటికీ నగల బంగారం ధర రూ.8,100 తక్కువగానే ఉంది. అందువల్ల ఇప్పటికీ బంగారం కొనుగోళ్లు కంటిన్యూ అయ్యే అవకాశాలుంటాయి. ఐతే... వచ్చే వారం బ్రిటన్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలవుతుంది కాబట్టి... అప్పటి నుంచి ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు.