Gold and Silver Price Today: ప్రపంచవ్యాప్తంగా కరోనా జోరు కొనసాగుతుంటే... వ్యాక్సిన్ల పంపిణీ కూడా ఈ నెలలో మొదలుకాబోతోంది. ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్న దశలో ఉండటంతో స్టాక్ మార్కెట్లతోపాటూ... బులియన్ మార్కెట్లు కూడా దూసుకెళ్తున్నాయి. బంగారంపై పెట్టుబడులు మళ్లీ పెరుగుతుంటే... ధరలు ఆకాశంవైపు దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. వెండి ధర మాత్రం కొద్దిగా తగ్గింది. మరి నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేటి బంగారం ధరలు (4-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,900 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.750 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,720 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.600 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,590 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,070 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.810 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,056 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.648 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,007 ఉంది.
నగలు కొనేందుకు సరైన టైమ్: గత 10 రోజులుగా చూస్తే... చివరి 7 రోజుల్లో 5 రోజులు బంగారం ధరలు భారీగా తగ్గగా... మూడ్రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. అందువల్ల మున్ముందు కూడా ఇంకా పెరుగుతాయనే అంచనా ఉంది. బంగారం నగలు కొనుక్కోవాలనుకునేవారు ఇప్పుడే కొనుక్కోవడం బెటరంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఐతే... కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలయ్యాక... బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయంటున్నారు. అందుకు మరో 2 లేదా 3 నెలలు పట్టే అవకాశం ఉంది. ఆగస్టు 7 నగల బంగారం (22 క్యారెట్లు) 10 గ్రాములు రూ.54,200 ఉంది. ప్రస్తుతం రూ.45,900 ఉంది. అప్పటికీ, ఇప్పటికీ బంగారం ధర రూ.8,300 తగ్గింది. అందువల్ల ఇప్పుడు బంగారం నగలు కొనుక్కునేందుకు సరైన టైమ్ అంటున్నారు విశ్లేషకులు.