Gold and Silver Price Today: బంగారం ధరల్లో మళ్లీ కంటిన్యూ జోరు కనిపిస్తోంది. బ్రిటన్లో వచ్చిన కొత్త వైరస్ ఇండియాలో కూడా ప్రవేశిస్తుందేమో అనే భయాందోళనలు... ఇన్వెస్టర్లను బంగారంపై పెట్టుబడి పెట్టేలా చేస్తున్నాయి. అందువల్ల ఎవరైనా బంగారు నగలు కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనుక్కోమంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. నవంబర్ 30 నుంచి కంటిన్యూగా బంగారం ధరలు పెరుగుతున్నాయి కాబట్టి... ఈ పెరుగుదల మరికొన్నాళ్లు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు గనుక నగలు కొనుక్కోకపోతే... మున్ముందు ధరలు మరింత పెరిగి... కొనుక్కోవడం కష్టం అవుతుందని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి బంగారం ధరలు (27-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,700 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పులేదు. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.37,360 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,670 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,940 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,752 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,094 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి వెండి ధరలు (27-12-2020): వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,200 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. తులం వెండి ధర ప్రస్తుతం రూ.569.60 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పులేదు. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.71.20 ఉంది. ఈ సంవత్సరం ఆగస్ట్ 7న అత్యధిక ధరకు చేరిన వెండి ఆ రోజున కేజీ 76,510గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ ఆ రోజున కేజీ రూ.57,000కి పడింది. ఆ తర్వాత నుంచి చూస్తే వెండి ధర పెరుగుతూ ఉంది. మరికొన్ని రోజులు ఈ పెరుగుదల కనిపించేలా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధరల విశ్లేషణ: బంగారం ధరలు ప్రస్తుతం చూస్తే పెరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఆగస్ట్ 7న బంగారం ధర అత్యధిక రేటుకి చేరింది. ఆ రోజున నగల బంగారం (22 క్యారెట్లు)... 10 గ్రాములు రూ.54,130 ఉంది. ఆ తర్వాత నుంచి ధరలు తగ్గుతూ పోయాయి. నవంబర్ 30న బాగా తగ్గాయి. ఆ రోజున 10 గ్రాములు రూ.44,700 ఉంది. డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరుగుదల మొదలైంది. ఇప్పుడు రూ.46,700 ఉంది. అంటే... 26 రోజుల్లో ధర రూ.2,000 పెరిగినట్లు లెక్క. సో... ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయమే అంటున్నారు విశ్లేషకులు. బంగారం కొనుక్కోవాలనుకునేవారు ఇప్పుడే కొనుక్కుంటే మేలనీ... మున్ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)