Gold and Silver Price Today: యూరప్‌లో సెప్టెంబర్‌లో బయటపడిన కరోనా కొత్త వైరస్... ఇప్పుడు జోరుగా వ్యాపిస్తుండటంతో... ఒక్కసారిగా ప్రపంచ దేశాల్లో కలకలం, కలవరం రేగాయి. తిరిగి లాక్డౌన్ల లోకి వెళ్లిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఆర్థిక సమస్యలు మళ్లీ పెరిగేలా ఉన్నాయి. దాంతో... ఆయా దేశాల్లో ఇన్వెస్టర్లు... స్టాక్ మార్కెట్లు, ఇతరత్రా మార్గాల్లోని పెట్టుబడులను వెనక్కి తీసుకొని... సేఫ్ మోడ్ అయిన బంగారంలో పెడుతున్నారు. అందువల్లే కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా... తిరిగి ధరలు తగ్గుతాయా అనేది మాట్లాడుకునే ముందు... నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి బంగారం ధరలు (22-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.47,100 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.290 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.37,680 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.232 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,710 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.51,380 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.320 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.41,104 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.256 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,138 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి వెండి ధరలు (22-12-2020): వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73,700 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.2,100 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.589.60 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.16.80 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.73.70 ఉంది. ఈ సంవత్సరం ఆగస్ట్ 7న అత్యధిక ధరకు చేరిన వెండి ఆ రోజున కేజీ 76,510గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ ఆ రోజున కేజీ రూ.57,000కి పడింది. ఆ తర్వాత నుంచి వెండి ధర పెరుగుతూనే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధరల విశ్లేషణ: నవంబర్ 30 తర్వాత నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. కొత్త వైరస్ భయం నానాటికీ పెరుగుతోంది కాబట్టి... బంగారంపై పెట్టుబడుల జోరు మరికొన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇండియా జనవరిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించేలా కనిపిస్తోంది. అదే జరిగితే... జనవరిలో బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఐతే... ఈ కొత్త కరోనా వైరస్ జోరు ఎక్కువైతే మాత్రం బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయనుకోవచ్చు. అందువల్ల గోల్డ్ పై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది సరైన టైమే అనుకోవచ్చు. ఐతే... జనవరిలో ఓ కన్నేసి ఉంచాలి. అప్పుడు ధరలు తగ్గుతూ ఉంటే... జాగ్రత్త పడాలి. కొత్త కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తే... అంతలా బంగారంపై పెట్టుబడులు పెరగొచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)