Gold and Silver Price Today: ఏప్రిల్ నుంచి మొదలైన 2020-2021 ఆర్థిక సంవత్సరంలో... నవంబర్ వరకూ... బంగారం దిగుమతులు 40 శాతం తగ్గాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే అంశం. ఎందుకంటే... బంగారం దిగుమతులు తగ్గితే... కరెంటు ఖాతా లోటు తగ్గుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నవంబర్ వరకూ రూ.90,536 కోట్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది. కరోనా వల్లే దిగుమతులు తగ్గాయి. ఐతే... నవంబర్ నుంచి దిగుమతులు మెల్లగా పెరుగుతున్నాయి. అటు వెండి దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. ఏప్రిల్-నవంబర్ టైమ్లో 65.7 శాతం తగ్గాయి. మొత్తం దిగుమతుల విలువ రూ.5,535 కోట్లుగా ఉంది. ఫలితంగా దేశ వాణిజ్య లోటు తగ్గి మేలు జరిగింది. ఐతే... ప్రపంచ దేశాల్లో బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా టాప్ ప్లేస్ లో ఉంది. ఏటా ఇండియా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ భాగం నగల కోసమే వాడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి బంగారం ధరలు (21-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,810 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.37,448 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,681 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.51,060 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,848 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,106 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి వెండి ధరలు (21-12-2020): వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,600 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.100 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.572.80 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.0.80 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.71.60 ఉంది. ఈ సంవత్సరం ఆగస్ట్ 7న అత్యధిక ధరకు చేరిన వెండి ఆ రోజున కేజీ 76,510గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ ఆ రోజున కేజీ రూ.57,000కి పడింది. ఆ తర్వాత నుంచి వెండి ధర పెరుగుతూనే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధరల విశ్లేషణ: నవంబర్ 30 తర్వాత నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కరోనాలో కొత్త రకం రూపాంతర వైరస్ చాలా దేశాలకు విస్తరిస్తోంది. అందువల్ల మళ్లీ ప్రపంచ దేశాల్లో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మళ్లీ బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయి. తద్వారా బంగారం ధర మళ్లీ అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. ఐతే... ఈ కొత్త వైరస్ అంత ప్రభావం చూపకపోవచ్చు అంటున్నారు. ఇది ఎంత ప్రభావం చూపుతుంద అనే దాన్ని బట్టీ... బంగారం ధరలు ఏమాత్రం పెరుగుతాయి అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనిపై ఓ కన్నేసి ఉంచాలి. అలాగే... ఇండియాలో వ్యాక్సిన్ పంపిణీ మొదలైతే బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. దానిపైనా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)