Gold and Silver Price Today: నవంబర్ 30 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఐతే... ఇవి మరికొన్ని రోజులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరో 4 లేదా 5 వేల రూపాయల దాకా బంగారం ధరలు పెరగొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే... 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ధర దాదాపు రూ.55,000 దాకా వెళ్లే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు. ఐతే... ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలయ్యాక మాత్రం బంగారం ధరలు భారీగా పడిపోతాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం జనవరిలో కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి బంగారం ధరలు (20-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,800 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.37,440 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,680 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.51,050 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,840 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,105 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి వెండి ధరలు (20-12-2020): వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,500 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. తులం వెండి ధర ప్రస్తుతం రూ.572 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.71.50 ఉంది. ఈ సంవత్సరం ఆగస్ట్ 7న అత్యధిక ధరకు చేరిన వెండి ఆ రోజున కేజీ 76,510గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ ఆ రోజున కేజీ రూ.57,000కి పడింది. ఆ తర్వాత నుంచి వెండి ధర పెరుగుతూనే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధరల విశ్లేషణ: బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే నవంబర్ 30 నుంచి ధర పెరుగుతున్నా... జనవరిలో భారీగా తగ్గే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఒకవేళ ఈ నెలాఖరులోనే ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగితే... ఈ నెలలోనే ధరలు తగ్గొచ్చంటున్నారు. ఐతే... ఇలా ధర తగ్గిన తర్వాత... దేశంలో బంగారం నగలకు డిమాండ్ మరింత పెరుగుతుందనీ... అందువల్ల మళ్లీ ధరలు జనవరి మధ్య నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందువల్ల దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టుకుంటే కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)