Gold and Silver Price Today: బంగారం ధరలు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. బంగారంపై పెట్టుబడి పెట్టే కంపెనీల వారు సహజంగానే ధరలు పెరుగుతున్నాయనీ, పెట్టుబడులు పెట్టమని ఎంకరేజ్ చేస్తారు. ఐతే... వాస్తవం ఏంటన్నది మనం తెలుసుకొని తీరాలి. లేదంటే అడ్డంగా బుక్కైపోతాం. నిజానికి ఆగస్ట్ 7 నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. కానీ నవంబర్ 30 నుంచి పెరుగుదల మొదలైంది. మధ్యమధ్యలో కాస్త తగ్గుతున్నా... 20 రోజులతో పోల్చితే... బంగారం ధరలు ఇప్పడు పెరిగినట్లే లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి బంగారం ధరలు (19-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,800 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.400 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.37,440 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.320 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,680 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.51,050 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.450 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,840 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.360 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,105 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి వెండి ధరలు (19-12-2020): వెండి ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 24 నుంచి వెండి ధరలు అలా అలా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,500 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.900 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.572 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.7.20 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.71.50 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధరల విశ్లేషణ: బులియన్ మార్కెట్ నిపుణులు... కరోనాకి వ్యాక్సిన్లు రాగానే బంగారం ధరలు బాగా పడిపోతాయని అంచనా వేశారు. కానీ అలా జరగట్లేదు. నిజానికి వ్యాక్సిన్ వచ్చాక కూడా ధరలు పెరుగుతున్నాయి. ఆగస్ట్ 7 నుంచి బంగారం ధరలు పడిపోతూ వచ్చాయి. మధ్యమధ్యలో పెరిగినా... ఓవరాల్ ట్రెండ్... డౌన్ ఫాల్గా కనిపించింది. అ ట్రెండ్... నవంబర్ 30 నుంచి మారింది. ఈ 20 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.2,100 పెరిగింది. అంటే... నవంబర్ 30న బంగారం కొనుక్కున్న వారు చాలా తక్కువ ధరకే కొనుక్కున్నట్లు లెక్క. ఐతే... ఇకపైనా ధరలు పెరుగుతాయా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఆగస్ట్ 7తో పోల్చితే... ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.7,400 తక్కువగానే ఉంది. మున్ముందు ఇంకా పెరిగితే... ఇబ్బందే. ఇవన్నీ ఆలోచించుకొని గోల్డ్ కొనుక్కునేవారు... సరైన నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)