Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలు అంచనాలకు అందని విధంగా మారుతున్నాయి. వెండి ఎలా ఉన్నా... బంగారం ధరలు మాత్రం ఆగస్ట్ 7 నుంచి తగ్గుతున్నాయి. కాబట్టి... ఎవరైనా బంగారు నగలు కొనుక్కోవాలని అనుకుంటూ... ఎప్పటికప్పుడు ఇంకా ధర తగ్గుతుందేమో అని నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటే... వారు ఇప్పుడు కొనుక్కోవచ్చు. మున్ముందు కూడా ధరలు తగ్గే అవకాశాలు ఉన్నప్పటికీ... ప్రస్తుతం మాత్రం పసిడి ధరలు తక్కువగానే ఉన్నట్లు లెక్క. అందువల్ల నగలు కొనుక్కునేందుకు ఇదే సరైన టైమ్ అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి బంగారం ధరలు (16-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,800 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,640 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,580 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,960 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.39,968 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,996 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
నేటి వెండి ధరలు (16-12-2020): వెండి ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 24 నుంచి వెండి ధరలు అలా అలా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.67,900 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.4,700 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.543.20 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.37.60 పెరిగింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.67.90 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధరలు ఏ మాత్రం తగ్గాయి?: బంగారం ధరలను మనం టెక్నికల్‌గా విశ్లేషిద్దాం. 2019 డిసెంబర్ 17న అంటే సంవత్సరం కిందట నగల బంగారం (22 క్యారెట్లు) 10 గ్రాములు రూ. 39,600 ఉంది. మరి ఇప్పుడో రూ.45,800 ఉంది అంటే... ధర రూ.6,200 పెరిగింది. ఇలా పెరిగిన ధర... ఆగస్ట్ 7న అత్యధిక స్థాయికి చేరింది. ఆ రోజున నగల బంగారం 10 గ్రాములు రూ.59,130గా ఉంది. ఆ తర్వాత నుంచి ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం రూ.45,800 ఉంది కాబట్టి... ఆగస్టు 7తో పోల్చితే ధర రూ.13,330 తగ్గినట్లు లెక్క. అంటే భారీగా తగ్గినట్లే. అందువల్లే ఇప్పుడే బంగారం కొనుక్కోవడం మేలంటున్నారు. ఐతే... ఈ ధర ఇంకా తగ్గుతుందా, లేక పెరుగుతుందా అన్నది మాత్రం అంచనాలకు అందట్లేదు. బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఇంకా తగ్గొచ్చని అంటున్నా... కచ్చితంగా తగ్గుతుందని మాత్రం చెప్పట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)