Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలు గత వారం కొద్దిగా పెరిగినా... ఈ వారం తగ్గుతున్నాయి. ఇవాళో, రేపో అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలుకానుంది. 30 లక్షల మందికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. దీంతో... ఇక కరోనా పని అయిపోయినట్లే అని భావిస్తూ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ తగ్గి... ధర తగ్గుతోంది.
నేటి బంగారం ధరలు (15-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,800 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.210 తగ్గింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,640 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.168 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,996 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,960 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.230 తగ్గింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.39,968 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.184 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,996 ఉంది.
నేటి వెండి ధరలు (15-12-2020): వెండి ధరలు వరుసగా రెండులు పెరిగి, మళ్లీ భారీగా తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.63,200 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.4,200 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.505.60 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.33.60 తగ్గింది. ఒక్క గ్రాము వెండి కావాలంటే దాని ధర రూ.63.20 ఉంది.
బంగారం ఇక డౌన్ ఫాలేనా?: అమెరికాలో ఏం జరిగినా, అది మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. అమెరికాలో ఇప్పుడు వ్యాక్సిన్ పంపిణీ జరగబోతోంది. అలాగే... 10 రోజుల్లో క్రిస్మస్ రాబోతోంది. ఆ తర్వాత జనవరి ఫస్ట్... ఆ తర్వాత జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇలా అమెరికాలో అన్నీ మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఫలితంగా బంగారంపై పెట్టుబడులను కరెన్సీ, ఇతరత్రా వాటిపై పెట్టే అవకాశాలున్నాయి. అందువల్ల గోల్డ్ రేట్లు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఆగస్ట్ 7 నుంచి బంగారంపై పెట్టుబడులు పెడుతున్నవారు నష్టపోతూనే ఉన్నారు.