Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఐతే... గత వారం తగ్గుదలతో పోల్చితే... పెరుగుదల తక్కువగానే ఉంది. ప్రధానంగా దేశంలో రైతులు ఆందోళనలు చేయడం, భారత్ బంద్ వంటివి బంగారంపై పెట్టుబడులు పెరిగేలా చేశాయి. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ అంశాలు కూడా ప్రభావం చూపుతున్నప్పటికీ... దేశంలో అనిశ్చిత పరిస్థితులే బంగారం, వెండి ధరలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి.
నేటి బంగారం ధరలు (14-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,010 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 పెరిగింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.36,808 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,601 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,190 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 పెరిగింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.40,152 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.8 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.5,019 ఉంది.
పడిపోతున్న బంగారం ధరలు: స్వల్పకాలంలో ధరలు పెరిగినట్లు కనిపిస్తున్నా... ఓవరాల్గా చూస్తే... 4 నెలలుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఆగస్ట్ 7న బంగారం ధర అత్యధిక స్థాయికి అంటే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రూ.59,130 ఉంది. ఆ తర్వాత నుంచి హెచ్చుతగ్గులతో బంగారం ధరలు పడిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం 50,190 మాత్రమే ఉన్నాయి. అంటే... 4 నెలల్లో బంగారం ధరలు రూ.9వేల దాకా తగ్గాయి. నవంబర్ 30 తర్వాత నుంచి మాత్రం బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. అందువల్ల పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.