Gold and Silver Price Today: ప్రపంచవ్యాప్తంగా కరోనా అంతు చూసేందుకు వ్యాక్సిన్ల తయారీకి టైమ్ దగ్గర పడింది. వచ్చే 6 నెలల్లో దాదాపు 10 వ్యాక్సిన్లు రాబోతున్నాయి. అందుకే... ఇన్వెస్టర్లు... ఇక బంగారంపై పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ... స్టాక్ మార్కెట్లు, కరెన్సీలు, క్రూడ్ వంటి ఇతరత్రా అంశాలవైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పాతాళం వైపు పరుగలు పెడుతున్నాయి. వెండి కూడా పడిపోతోంది. సో... మీరు బంగారు నగలు, వెండి కొనాలనుకుంటే... ఇంత కంటే బెస్ట్ టైమ్ ఉండదు. త్వరపడితే బెటరే అంటున్నారు నిపుణులు.
నేటి బంగారం ధరలు (1-12-2020): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.44,700 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.310 తగ్గింది. తులం బంగారం కావాలంటే... దాని ధర రూ.35,760 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.248 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,470 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,764 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.336 తగ్గింది. అదే తులం బంగారం కావాలంటే దాని ధర రూ.39,011.20 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.268.80 తగ్గింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,876.40 ఉంది.
నగలు కొనేందుకు సరైన టైమ్: ఆగస్టు 7 నగల బంగారం (22 క్యారెట్లు) 10 గ్రాములు రూ.54,200 ఉంది. మరి ఇవాళ రూ.44,700 ఉంది. అంటే... దాదాపు ఈ 4 నెలల కాలంలో బంగారం ధర రూ.9,500 తగ్గింది. అందువల్ల ఇప్పుడు బంగారం నగలు కొనుక్కునేందుకు సరైన టైమ్ అంటున్నారు విశ్లేషకులు. ఐతే... ధరలు ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి... మరిన్న కొన్ని రోజులు ఎదురు చూస్తూ... తిరిగి పెరిగే దశ మొదలయ్యే సమయంలో కొనుక్కుంటే... కలిసొస్తుందని చెప్పేవాళ్లూ ఉన్నారు. వచ్చే సంవత్సరంలో మళ్లీ బంగారం ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి.