నగలు కొనేందుకు సరైన టైమ్: ఆగస్టు 7 నగల బంగారం (22 క్యారెట్లు) 10 గ్రాములు రూ.54,200 ఉంది. మరి ఇవాళ రూ.44,910 ఉంది. దాదాపు ఈ 4 నెలల కాలంలో బంగారం ధర రూ.9వేలు తగ్గింది. అందువల్ల ఇప్పుడు బంగారం నగలు కొనుక్కునేందుకు సరైన టైమ్ అంటున్నారు విశ్లేషకులు. ఐతే ధరలు ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ధరలను నిత్యం చెక్ చేస్తూ.. ఇక పెరుగుతాయి అనే సమయంలో కొనుక్కుంటే మేలని అభిప్రాయపడుతున్నారు.