బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చా?: శనివారం నాటి భారీ పతనంతో బంగారంపై పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది సమస్యగా మారింది. సెప్టెంబర్ 24న 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ.51,870 ఉంది. ఆ తర్వాత నుంచి క్రమంగా ధర పెరుగుతూ వచ్చింది. అక్టోబర్ 12న ధర గరిష్టస్థాయి అంటే... రూ.53,310కి చేరింది. ఆ తర్వాత డౌన్ అయిన ధర... అక్టోబర్ 17న అత్యల్ప స్థాయికి చేరింది. ఆ రోజు ధర రూ.51,050కి చేరింది. అంటే సెప్టెంబర్ 24 నాటి ధర కంటే తక్కువకు పడిపోయింది. మళ్లీ ఇప్పుడు పెరుగుదల కనిపిస్తోంది. దసరా, దీపావళి, ధంతేరస్ నాటికి ధర పెరగవచ్చనే అంచనా ఉంది. జనవరి 1 నుంచి చూస్తే... బంగారం ధర ఆ రోజు రూ.40,720 ఉంది. ఇప్పుడు రూ.51,730 ఉంది. అంటే... రూ.11వేలకు పైగా ధరలో పెరుగుదల ఉంది. అందువల్ల దీర్ఘకాలిక లాభాలను ఆశించి మాత్రమే బంగారంపై పెట్టుబడి పెట్టడం మేలంటున్నారు నిపుణులు.