బంగారం ధరలు ఆగస్టు నుంచి తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 17న 22 క్యారెట్ల బంగారం (10 గ్రా.) ధర రూ.51,670గా ఉంటే.. ప్రస్తుతం రూ.46,400 ఉంది. అంటే 5 నెలల్లో రూ.5,270 తగ్గింది. ఐతే డిసెంబరు 16 నుంచి మళ్లీ స్పల్పంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారానికి ప్రతి రోజు రూ. 200-400 మేర ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.