GOLD AND SILVER PRICE RISES IN HYDERABAD KNOW LATEST RATES SS
Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price Today | బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్ రూ.50,000 మార్క్ దాటిన సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.40 పెరగగా వెండి ధర రూ.390 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2. హైదరాబాద్‌లో 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.40 పెరగడంతో రూ.50,660 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
3. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 40 గ్రాములపై రూ.190 పెరగడంతో రూ.46,450 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
4. హైదరాబాద్‌లో కిలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.390 పెరగడంతో ప్రస్తుతం రూ.48,500 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
5. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.12 శాతం అంటే రూ.60 పెరగడంతో రూ.48,365 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
6. ఎంసీఎక్స్‌లో వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలోపై 0.29 శాతం అంటే రూ.138 పెరిగి రూ.48,503 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,772.90 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 17.91 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
8. కరోనా వైరస్ సంక్షోభంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో గోల్డ్ రూ.50,000 మార్క్ దాటింది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
9. గత ఏడాదిలో గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ 40.39 శాతం ఉండటం విశేషం. అందుకే ఇంత రేటు పెరిగినా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇన్వెస్టర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
10. అయితే ప్రస్తుతం బంగారం ధరలు రికార్డులు సృష్టిస్తున్నా భవిష్యత్తులో ధరలు తగ్గొచ్చని విశ్లేషిస్తున్నారు నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)