GOLD AND SILVER PRICE FALLS IN MCX KNOW LATEST GOLD AND SILVER RATES IN HYDERABAD SS
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు... ఇప్పుడు కొనొచ్చా?
Gold Price Today | బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత నాలుగు రోజులుగా గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోతున్నాయి. ఇవాళ్లి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. బంగారం, వెండి ధరలు భారీగా దిగొస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో ఈరోజు కూడా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2. ఎంసీఎక్స్‌లో బంగారం ధర చూస్తే గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై ఏకంగా 0.77 శాతం అంటే రూ.405 పతనమై రూ.52,525 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
3. ఇక ఎంసీఎక్స్‌లో వెండి ధర కూడా తగ్గింది. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలోపై ఒకేసారి 3.20 శాతం అంటే రూ.2,277 తగ్గి రూ.68,800 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
4. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.260 పెరిగి ధర రూ.55,760 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
5. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.51,110 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,948.50 డాలర్లకు కాగా ఔన్స్ వెండి ధర 26.73 డాలర్లకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
6. హైదరాబాద్‌లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.50 తగ్గి రూ.66,950 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
8. ఈ వారంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. కానీ గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువ ధరలోనే ఉన్నాయి. ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చా అన్న చర్చ ఇన్వెస్టర్లలో జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
9. ఈ ఏడాది బంగారంపై ఇన్వెస్ట్ చేసినవారికి భారీగానే లాభాలు వచ్చాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు బంగారం ధర భారీగానే పెరిగింది. కానీ ఈ వారం గోల్డ్, సిల్వర్ రేట్స్ తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
10. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్‌కు 10% కేటాయించాలని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేసినా మరి కొన్ని నెలల్లో 10 నుంచి 15 శాతం రిటర్న్స్ పొందొచ్చని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)