Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర... హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర... హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price Today | నాలుగు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వెండి ధర కూడా తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. కొంతకాలంగా బంగారం ధరలు పతనాన్ని చూస్తున్నాయి. ఆకాశాన్ని తాకుతున్న ధరలు కాస్తా దిగి వస్తున్నాయి. హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. హైదరాబాద్‌లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గింది. దీంతో ధర రూ.46,250 నుంచి రూ.46,100 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఇక స్వచ్ఛమైన బంగారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల ధర రూ.10 పెరగడంతో రూ.50,460 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గడంతో ధర రూ.72,500 నుంచి రూ.72,400 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. ఇక మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధరపై 0.14 శాతం అంటే రూ.67 తగ్గి రూ.49,381 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై 0.80 శాతం అంటే రూ.540 తగ్గి రూ.66,760 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పగ్గాలు చేపట్టడంతో ఉద్దీపనపై ఆశలు పెరిగాయి. దీంతో ఔన్స్ బంగారం ధర 0.1% పెరిగి 1,872.25 డాలర్ల దగ్గర ట్రేడ్ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)