బంగారం కొనాలనుకునేవారికి ఇది బంగారం లాంటి సమయం. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1950 తగ్గింది. దీంతో ధర రూ. 38.062కు పడిపోయింది. గత నెలలో రూ. 40,000 ఉండగా ఇప్పుడు రికార్డు స్థాయిలో ధరలు క్షీణించాయి. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 120 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 36,600కు పడిపోయింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెల్లర్ల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధర క్షీణిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇలానే కొనసాగుతున్నాయి. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్లు మందగించడంతో ఈ ధరలు కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయం మార్కెట్లోనూ బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్ ధర 0.16శాతం తగ్గడంతో 1,495.15 డాలర్లకు క్షీణించింది.