1. కొత్త కారు కొంటే ఫీచర్స్ ఏం ఉన్నాయి? మైలేజీ ఎంత ఇస్తుంది? ఆన్ రోడ్ ధర ఎంత? ఈఎంఐ ఎంత కట్టాలి? అన్న విషయాలు మాత్రమే చూస్తారు కానీ... ఆ కారు సేఫ్టీ ఫీచర్స్ చూసేవాళ్లు తక్కువే. ఇటీవల ఫోర్‌వీలర్ కొనేప్పుడు సేఫ్టీ ఫీచర్స్ (Car Safety Features) చూసే అలవాటు కస్టమర్లలో కొంత పెరుగుతూ వస్తోంది. మరోవైపు కంపెనీలు కూడా సేఫ్టీ ఫీచర్స్ విషయంలో కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఒక కారు తయారైనప్పుడు ఆ కారు సురక్షితమైనదా? కాదా? అని తెలుసుకునేందుకు క్రాష్ టెస్ట్ (Crash Test) నిర్వహించి ర్యాంకింగ్ ఇస్తాయి పలు సంస్థలు. గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (Global NCAP) తన సేఫ్ కార్ ఇండియా మిషన్ (Safer Car for India Mission) కార్యక్రమంలో భాగంగా మేడ్ ఇన్ ఇండియా కార్లను క్రాష్ టెస్ట్ చేసి ర్యాంకులు ఇచ్చింది. కారులో ముందు రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే పని చేస్తున్న క్రాష్ టెస్ట్‌లో పెద్దలు, పిల్లల భద్రత ఎలా ఉందన్న అంశాన్ని పరిశీలించాయి. ఈ లిస్ట్‌లో మహీంద్రా, టాటా మోటార్స్ కార్లు టాప్‌లో నిలవడం విశేషం. మరి ఏ కారు ఎంత సేఫ్‌గా ఉందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Mahindra XUV 700: భారతదేశంలో సురక్షితమైన కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మొదటి స్థానంలో ఉంది. క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ లభించింది. ఎక్స్‌యూవీ 700 కారు గతేడాది రిలీజైంది. ఇందులో ఫ్రంట్ కొల్లిజన్ వార్నింగ్, ఎమర్జెన్సీ అటానమస్ బ్రేకింగ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. Mahindra XUV 300: మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కన్నా మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కాస్త చిన్నగా ఉంటుంది. ఎక్స్‌యూవీ 700 కారుకు వచ్చిన సేఫ్టీ రేటింగ్ ఎక్స్‌యూవీ 300 కారుకు రావడం విశేషం. క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ లభించింది. (ప్రతీకాత్మక చిత్రం)