Gold Price Today: ఈ నెంబర్కు ఓ మిస్డ్ కాల్ ఇస్తే బంగారం ధర తెలుస్తుంది
Gold Price Today: ఈ నెంబర్కు ఓ మిస్డ్ కాల్ ఇస్తే బంగారం ధర తెలుస్తుంది
Gold price today | బంగారం రేటు ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గోల్డ్ రేట్ తెలుసుకోవడానికి చాలామార్గాలు ఉన్నాయి. వేర్వేరు వెబ్సైట్లలో వేర్వేరుగా ధరలు ఉంటాయి. మరి సరైన ధరలు ఎలా తెలుసుకోవాలంటే చాలా సింపుల్. ఓ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే గోల్డ్ రేట్ తెలుస్తుంది.
1. మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ముందుగా గోల్డ్ రేట్ తెలుసుకోవాలి. బంగారం ధరల గురించి సామాన్యులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. బంగారం కొన్నా, కొనకపోయినా గోల్డ్ రేట్ తెలుసుకోవాలనుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. బంగారం ధరలు రోజూ మారుతూ ఉంటాయి. మార్కెట్లో డిమాండ్, సప్లైని బట్టి ధర మారుతూ ఉంటుంది. అందుకే సామాన్యులు ఏరోజున గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసుకుంటూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. బంగారం ధర తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నగల షాపులు షాపు ముందు ఆరోజు బంగారం ధరలను డిస్ప్లే చేస్తుంటాయి. వార్తా పత్రికల్లో కూడా గోల్డ్ రేట్స్పైన అప్డేట్స్ వస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. ఇక టెక్నాలజీ పెరిగిపోవడంతో గోల్డ్ రేట్ తెలుసుకోవడం చాలా సులువైపోయింది. గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రాంతాల వారీగా బంగారం ధర తెలుస్తుంది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు... ఎక్కడ ఏరోజున గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. అయితే గోల్డ్ రేట్ తెలిపే వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. ఆ వెబ్సైట్లలో ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఇండియా బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్-IBJA ప్రకటించే ధరల్నే మార్కెట్ ధరలుగా పరిగణిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఇండియా బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్-IBJA ప్రతీరోజూ గోల్డ్ రేట్స్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. వీరి వెబ్సైట్ https://www.ibja.co/ లో రోజూ ధరలు అప్డేట్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. బంగారం ధరలు రోజూ తెలుసుకోవాలనుకునేవారి కోసం మిస్డ్ కాల్ సర్వీస్ ప్రారంభించింది IBJA. వీరికి చెందిన 8955664433 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే ఆరోజు బంగారం ధరల వివరాలు తెలుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. మీరు 8955664433 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో 22 క్యారట్, 18 క్యారట్, 14 క్యారట్ బంగారం ధరల వివరాలు తెలుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)