1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వేర్వేరు వర్గాలకు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను అందిస్తోంది. అలాంటి పాలసీల్లో ఎల్ఐసీ జీవన్ అమర్ పాలసీ (LIC Jeevan Amar Policy) కూడా ఒకటి. ఈ పాలసీలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తోంది ఎల్ఐసీ. ఇలాంటి పాలసీలు సాధారణంగా కొన్నే ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇది నాన్ లింక్డ్, వితౌట్ ప్రాఫిట్, ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. ఈ పాలసీలో రెండు రకాల డెత్ బెనిఫిట్స్ ఉంటాయి. లెవెల్ సమ్ అష్యూర్డ్ ఒక ఆప్షన్ కాగా, సమ్ అష్యూర్డ్ పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది ఎల్ఐసీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎల్ఐసీ జీవన్ అమర్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 65 ఏళ్లు. మెచ్యూరిటీ నాటికి గరిష్టంగా 80 ఏళ్ల వయస్సు ఎంచుకోవచ్చు. కనీస సమ్ అష్యూర్డ్ రూ.25,00,000. గరిష్ట పరిమితి లేదు. రూ.25,00,000 నుంచి రూ.40,00,000 వరకు రూ.1,00,000 చొప్పున సమ్ అష్యూర్డ్ పెంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎల్ఐసీ జీవన్ అమర్ పాలసీలో గరిష్టంగా రూ.10,00,000 చొప్పున సమ్ అష్యూర్డ్ పెంచుకోవచ్చు. ఇది టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ లాంటిది. పాలసీహోల్డర్ మరణిస్తేనే నామినీకి బెనిఫిట్ లభిస్తుంది. పాలసీ గడువు ముగిసిన తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు. ఉదాహరణకు రూ.50 లక్షలకు 20 ఏళ్ల టర్మ్‌తో లెవెల్ సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకుంటే ఎంత ప్రీమియం చెల్లించాలో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
5. 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.4,356 + జీఎస్టీ వార్షిక ప్రీమియం లేదా రూ.48,928 + జీఎస్టీ సింగిల్ ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.5,940 + జీఎస్టీ వార్షిక ప్రీమియం లేదా రూ.66,088 + జీఎస్టీ సింగిల్ ప్రీమియం చెల్లించాలి. 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.11,475 + జీఎస్టీ వార్షిక ప్రీమియం లేదా రూ.1,27,395 + జీఎస్టీ సింగిల్ ప్రీమియం చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఉదాహరణకు రూ.50 లక్షలకు 20 ఏళ్ల టర్మ్‌తో అష్యూర్డ్ పెంచుకునే ఆప్షన్‌తో పాలసీ తీసుకుంటే ఎంత ప్రీమియం చెల్లించాలో తెలుసుకుందాం. 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.5,715 + జీఎస్టీ వార్షిక ప్రీమియం లేదా రూ.63,720 + జీఎస్టీ సింగిల్ ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.8,415 + జీఎస్టీ వార్షిక ప్రీమియం లేదా రూ.94,095 + జీఎస్టీ సింగిల్ ప్రీమియం చెల్లించాలి. 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.17,664 + జీఎస్టీ వార్షిక ప్రీమియం లేదా రూ.1,95,868 + జీఎస్టీ సింగిల్ ప్రీమియం చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)