1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) జీవన్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను నిలిపివేసి వాటి స్థానంలో అవే పేర్లతో కొత్తగా రెండు పాలసీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు పాలసీల బెనిఫిట్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. అయితే ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ పాలసీ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఆప్షన్ 1 ఎంచుకొని 20 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.1 కోటి ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. రెగ్యులర్ ప్రీమియం అయితే ఏడాదికి రూ.7,047 + జీఎస్టీ చెల్లించాలి. అంటే రోజుకు ప్రీమియం రూ.20 లోపే. సింగిల్ ప్రీమియం అయితే రూ.75,603 + జీఎస్టీ చెల్లిస్తే చాలు. అతనికి 20 ఏళ్ల పాటు రూ.1 కోటి కవరేజీ లభిస్తుంది. పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబానికి బీమా డబ్బులు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పాలసీలో ఆప్షన్ 2 ఎంచుకున్నవారికి సమ్ అష్యూర్డ్ పెరుగుతూ ఉంటుంది. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం లెక్కేస్తే ఏడాదికి రూ.9,345 + జీఎస్టీ ప్రీమియం చెల్లించాలి. సింగిల్ ప్రీమియం అయితే రూ.1,02,617 + జీఎస్టీ చెల్లించాలి. పాలసీ 5 ఏళ్లు ముగిసిన తర్వాత ప్రతీ ఏటా 10 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. 15వ ప్రీమియం చెల్లించేనాటికి సమ్ అష్యూర్డ్ రెట్టింపు అవుతుంది. అంటే రూ.2 కోట్ల కవరేజీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్, ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్స్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు. కాబట్టి మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. ఈ ప్లాన్స్ తీసుకున్న వ్యక్తి, పాలసీ కొనసాగుతున్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఉపయోగపడే పాలసీలు ఇవి. (ప్రతీకాత్మక చిత్రం)