1. వృద్ధాప్యంలో పెన్షన్ వృద్ధులకు అనేక రకాలుగా ఆసరాగా ఉంటుంది. ఎలాంటి పెన్షన్ స్కీమ్స్‌లో లేనివాళ్లు బ్యాంకులు అందించే కొన్ని పథకాల్లో డబ్బులు దాచుకోవడం ద్వారా ప్రతీ నెలా కొంత పెన్షన్ పొందొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇలాంటి పథకాన్ని అందిస్తోంది. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme) పేరుతో ఈ పథకం అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. డిపాజిటర్లు ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేస్తే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఈఎంఐ రూపంలో డబ్బులు డిపాజిటర్ల అకౌంట్లలో ప్రతీ నెలా జమ అవుతాయి. ఇందులో కొంత అసలు, కొంత వడ్డీ కలిపి వస్తుంది. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలల కాలానికి డిపాజిట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లు సాధారణ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో సమానంగా ఉంటాయి. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.1 శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఎంచుకునే కాలవ్యవధిని బట్టి వడ్డీ మారుతుంది. డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినప్పుడు ప్రీమెచ్యూర్ క్లోజర్‌కు అనుమతి ఇస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కస్టమర్లు ఏ ఎస్బీఐ బ్రాంచ్‌లో అయినా ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో చేరొచ్చు. ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత ఇతర బ్రాంచ్‌లకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్లకు యూనివర్సల్ పాస్‌బుక్ జారీ చేస్తారు. మైనర్లు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. NRO, NRE కస్టమర్లు ఈ అకౌంట్ ఓపెన్ చేయడం కుదరదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎల్ఐసీలో కూడా ఇలాంటి ప్లాన్ ఉంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా ఇలాంటి సింగిల్ ప్రీమియం పాలసీని అందిస్తోంది. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ పేరుతో పెన్షన్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో ఒకసారి ప్రీమియం చెల్లించి 40 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)